: బాలీవుడ్ లో మరో జంట విడిపోయారు


బాలీవుడ్ కపుల్ కొంకణా సేన్ శర్మ, రణ్ వీర్ షోరేలు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. తమ ఐదేళ్ల దాంపత్యాన్ని తెగతెంపులు చేసుకున్నారు. ఈ విషయాన్ని కొంకణా ట్విట్టర్ లో ప్రకటించింది. "రణ్ వీర్, నేను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కానీ, స్నేహితులుగా కొనసాగుతూ మా కుమారుడి బాధ్యతలను కలసి పంచుకుంటాం. అందరికీ కృతజ్ఞతలు" అని కొంకణా ట్వీట్ చేసింది. ఇదే విషయాన్ని అటు రణ్ వీర్ కూడా ట్విట్టర్ లో పోస్టు చేశాడు. ప్రముఖ దర్శకురాలు అపర్ణాసేన్ కుమార్తే ఈ కొంకణా. బాలీవుడ్ లో మంచి నటిగా పేరున్న ఈమె, నాలుగేళ్ల పాటు నటుడు రణ్ వీర్ తో సహజీవనం చేసింది. ఈ క్రమంలో గర్భవతి కావడంతో 2010లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారికి హరూన్ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.

  • Loading...

More Telugu News