: హోటల్ సిబ్బందిపై మోడల్ దాడి


వివాదాలతో లైమ్ లైట్ లో ఉండటం, ప్రకటనలతో సంచలనం లేపడం వంటివి మోడల్ పూజా మిశ్రాకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా, పూజా మిశ్రాకు సంబంధించి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఢిల్లీలోని ద్వారకా హోటల్ లో పూజా మిశ్రా బస చేసింది. అయితే, హోటల్ ఖాళీ చేసి వెళ్లేటప్పుడు ఆమెను హోటల్ సిబ్బంది అడ్డుకున్నారు. ఎందుకంటే, ఆమె ఉన్న గదిలో కొన్ని వస్తువులు పగిలిపోయి ఉండటమే దీనికి కారణం. దీంతో మోడల్ రెచ్చిపోయింది. ‘నన్ను అడ్డుకుంటారా?’ అంటూ హోటల్ సిబ్బందిపై దాడి చేసింది. దీంతో కంగుతున్న హోటల్ సిబ్బంది ఆమెకు సర్దిచెప్పి పంపించారు.

  • Loading...

More Telugu News