: కోర్టులోనే ప్రాణాలు వదిలిన మేజిస్ట్రేట్
విధి నిర్వహణలో ఉన్న ఓ మేజిస్ట్రేట్ కోర్టు హాలులోనే తుదిశ్వాసను విడిచారు. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లా భద్రాచలం మేజిస్ట్రేట్ కోర్టులో జరిగింది. సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ సంజీవరావు తన బాధ్యతలను నిర్వహిస్తున్న సమయంలో, ఆకస్మికంగా గుండెపోటుకు గురయ్యారు. ఆ తర్వాత కాసేపటికే మరణించారు. జరిగిన ఘటనతో కోర్టు ఆవరణలో ఉన్న వారంతా షాక్ కు గురయ్యారు. కోర్టులో విషాద వాతావరణం నెలకొంది.