: రొనాల్డ్ రీగన్ నుంచి ఒబామా వరకూ... అధ్యక్షులకు సేవలందించిన ఆ చేతులు ఇక కదలవు!


పలువురు అమెరికా అధ్యక్షులకు టైలర్ గా పనిచేసిన ఫ్రెంచ్ వాసి జార్జెస్ డీ ప్యారీ తన 81వ ఏట మరణించారు. లిండన్ జాన్సన్ హయాంలో విధుల్లోకి చేరిన ఆయన ఆపై రోనాల్డ్ రీగన్, జిమ్మీ కార్టర్, సీనియర్ బుష్, జూనియర్ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామాలకు సూట్లు కుట్టారు. రెండు నెలల క్రితం వరకూ విధుల్లో ఉన్న ఆయనకు, బ్రెయిన్ ట్యూమర్ రావడంతో చికిత్స పొందుతూ ఆదివారం నాడు మరణించారు. 1963లో జాన్ ఎఫ్ కెనడీ హత్యకు గురైన తరువాత జాన్సన్ ఆ బాధ్యతలు స్వీకరించడంతో జార్జెస్ విధుల్లో చేరారు. అంతకుముందు వైవాహిక జీవితం విఫలమై, వైట్ హౌస్ కు సమీపంలోని ఓ టైలరింగ్ షాపులో పనికి కుదిరిన జార్జెస్ వద్ద, అప్పట్లో ఉపాధ్యక్షుడిగా ఉన్న జాన్సన్ ఓ సూటు కుట్టించుకున్నారు. ఆ సూటు కుట్టిన విధానం నచ్చడంతో, అధ్యక్షుడయ్యాక అతనికి వైట్ హౌస్ ఆతిధ్యం, ఆ వెంటనే ఆస్థాన టైలర్ గా నియామకం జరిగిపోయాయి. కొలతలు తీసుకుంటున్నప్పుడు ఏ అధ్యక్షుడు ఎలా ఉంటారన్న విషయమై జార్జెస్ పలు పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. జీవితాంతం సాధారణంగానే బతికిన జార్జెస్ మృతి పట్ల అధ్యక్షుడు ఒబామా సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News