: బీహార్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం: అమిత్ షా


ఇద్దరు రాజకీయ ఉద్ధండులు ప్రధాని నరేంద్ర మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లకు బీహార్ శాసనసభ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసి ప్రత్యర్థిని చావుదెబ్బ తీయాలని ఇరువురూ ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బీహార్ పీఠం తమదే అని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. మూడొంతుల సీట్లను తమ కూటమి కైవసం చేసుకుంటుందని ఆయన చెప్పారు. నితీష్ కుమార్ విధానాలు కాలం చెల్లినవని... బీహార్ ను మోదీ అత్యున్నత స్థాయికి తీసుకెళతారని అన్నారు. ఎన్టీఏ కూటమి అధికారం చేపట్టి బీహార్ ప్రజల ఆశలకు జీవం పోస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News