: వరంగల్ ఉపఎన్నికలో పోటీ చేయను: గద్దర్
వరంగల్ ఉపఎన్నికలో తాను పోటీ చేయబోనని ప్రజాగాయకుడు గద్దర్ వెల్లడించారు. ప్రస్తుతానికి ఉద్యమపాటగానే తాను ఉంటానని చెప్పారు. ఎన్నికల్లో పోటీపై సిద్ధాంతపరమైన చర్చ జరగాల్సి ఉందని అన్నారు. గద్దర్ ను దళిత సంఘాల నేతలు ఈరోజు కలిశారు. వారితో మాట్లాడిన అనంతరం గద్దర్ ఈ ప్రకటన చేశారు. వామపక్షాలకు చెందిన నేతలు గద్దర్ ను కలవడం, పోటీ చేయమని అడగటం తెలిసిన విషయమే. వరంగల్ ఉపఎన్నికలో గద్దర్ పోటీ చేయనని చెప్పడంతో ఇక ఆ అంశంపై చర్చకు తెరపడినట్లయింది.