: యువనేతలు కావలెను: రాహుల్ సెర్చింగ్


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భవిష్యత్ యువనేతల కోసం వెతికే పనిలో మునిగి పోయారు. ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు నాయకుల పేర్లను తమకు పంపమని చెప్పారు. దేశ వ్యాప్తంగా తమ పార్టీకి చెందిన 200 మంది కాంగ్రెస్ నాయకులను ఇంటర్వ్యూ చేశారు. కనీసం రెండు రౌండ్ల ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. రాహుల్ తాను అడగదల్చుకున్న ప్రశ్నలను తమ పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత అంటే ప్రధాన కార్యదర్శి స్థాయి ఉన్న వారి ద్వారా ఇంటర్వ్యూకు హాజరైన నాయకులను ప్రశ్నిస్తున్నారు. సంస్థాపరమైన బలహీనతలను గుర్తించి, వాటిపై ఇంటర్వ్యూలో మాట్లాడమంటున్నట్లు సమాచారం. అదే సమయంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై వారి కున్న పరిజ్ఞానాన్ని కూడా పరీక్షిస్తున్నారు. వారు చెప్పే విషయాలను రాహుల్ నోట్ చేసుకుంటున్నారుట. కాంగ్రెస్ నాయకులు వారు కనబర్చిన ప్రతిభను ఆధారంగా చేసుకుని గ్రేడ్ చేస్తున్నారు. ఎంపికైన నాయకులను పార్టీ కార్యదర్శులు, అబ్జర్వర్లు, రిటర్నింగ్ అధికారులుగా నియమిస్తారట. ఎంపికైన కొంతమంది నాయకులకు రాష్ట్రాలలో పార్టీకి చెందిన కీలక పదవులు కూడా ఇస్తారుట. ఈ విషయాలన్నింటిని ఒక ఆంగ్లపత్రిక ప్రచురించింది.

  • Loading...

More Telugu News