: ‘త్రిశక్తిమయ మోక్ష గణపతి’గా ఖైరతాబాదు గణనాథుడు... ఖర్చెంతో తెలుసా!
వినాయకచవితి సందర్భంగా ఖైరతాబాదులో కొలువుదీరనున్న గణనాధుడు ఈ దఫా మూడు రోజుల ముందుగానే భక్తులకు దర్శనమిచ్చాడు. ఈ ఏడాది గణనాధుడు ‘త్రిశక్తిమయ మోక్ష గణపతి’గా భక్తులకు దర్శనమిస్తున్నాడు. దాదాపు వంద రోజుల పాటు శ్రమించిన కళాకారులు ఎట్టకేలకు గణనాధుడి విగ్రహ తయారీని పూర్తి చేశారు. ఇందుకోసం ఖర్చు పెట్టిన మొత్తమెంతో తెలుసా?... అక్షరాలా రూ.50 లక్షలను ఖైరతాబాదు గణేశ్ ఉత్సవ కమిటీ వెచ్చించింది. ఈ మొత్తంలో దేనికెంత ఖర్చైందన్న విషయాన్ని కూడా కమిటీ సుస్పష్టంగా వెల్లడించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. స్టీలు రూ.8 లక్షలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రూ.4 లక్షలు షెడ్డు కర్రలు రూ.5 లక్షలు మోల్డింగ్ పనులకు రూ.10 లక్షలు ఫినిషింగ్ పనులకు రూ.5 లక్షలు షెడ్డు నిర్మాణం రూ.3 లక్షలు వెల్డింగ్ రూ.8 లక్షలు పెయింటింగ్ రూ.7 లక్షలు