: మత్తెక్కకపోవడంతో వింత చేష్టలు !
నిజామాబాద్ జిల్లాలో కల్తీకల్లు బాధితుల వింత చేష్టలు అన్నీఇన్నీ కావు. ఆసుపత్రిలో బాధితులు రాత్రంతా నిద్రపోకుండా అరుపులు పెట్టడం, మరికొందరు తమ ఒంటిపై దుస్తులు చింపుకోవడం వంటి వింత చేష్టలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్, నందిపేట్, మాక్లూర్, నవీపేట్, జక్రాన్ పల్లి, నిజామాబాద్ లోని స్థానిక వెంగళరావునగర్ కాలనీ, నాగారం, గౌతంనగర్, మిర్చి కాంపౌండ్, పోచమ్మ గల్లీ, తదితర ప్రాంతాలకు చెందిన కల్తీకల్లు బాధితులు ఈ రకమైన వింత చేష్టలు చేస్తున్నారు. వారి వింత చేష్టలకు కారణాలు ఏమై ఉంటాయోనని బాధిత కుటుంబీకులు వైద్యులను అడుగుతున్నారు. దీనికి కారణం..కల్లులో తగిన మోతాదులో రసాయనిక పదార్థాలు కలపకపోవడంతో మత్తు అంతగా ఎక్కదు. కల్లుకు బానిపైన వారికి ఈ మత్తు ఎక్కకపోవడంతో ఈ వింత చేష్టలు చేస్తున్నారని వైద్యులు అంటున్నారు.