: సెరెనాతో మ్యాచ్ అనగానే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుందట...తీరా మ్యాచ్ గెలిచి రన్నరప్ గా నిలిచిన విన్సీ


పెను సంచలనాలకు వేదికైన యూఎస్ ఓపెన్ తాజా సీజన్ లో అసలేమాత్రం అంచనాలు లేకుండానే రాబర్టా విన్సీ రంగంలోకి దూకింది. అయితే ఒక్కో మ్యాచ్ గెలుస్తూ సెమీస్ కు చేరింది. ఏదో బతుకు జీవుడా అంటూ సెమీస్ చేరితే, సెరెనా విలియమ్స్ లాంటి ఫోర్ హ్యాండ్ సత్తా గల క్రీడాకారిణితో పోటీ అంటే ఆ అన్ సీడెడ్ ప్లేయర్ బెంబేలెత్తిపోయింది. ఎదో అలా గెలిచి వచ్చా కానీ, సెరెనాతో గెలవడమంటే మాటలా? అన్న భావనతో సెమీస్ లోనే ఇంటి బాట పట్టక తప్పదని దాదాపుగా ఓ అంచనాకు వచ్చింది. అంతే, ఏమాత్రం ఆలోచించకుండా ఇంటికెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకుందట. అయితే అనూహ్యంగా సెరెనాను కంగుతినిపించిన విన్సీ నేరుగా ఫైనల్ కు చేరుకుంది. ఇంటికెళ్లేందుకు తీసుకున్న ఫ్లైట్ టికెట్ ను రద్దు చేసుకుంది. అయితే ఫైనల్ లో మాత్రం పెన్నెట్టా ధాటికి తట్టుకోలేక రన్నరప్ గా నిలిచింది. అయినా రూ.10.56 కోట్ల ప్రైజ్ మనీతో ఇంటికెళ్లింది.

  • Loading...

More Telugu News