: మహేంద్ర సింగ్ ధోనీకి ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు


మత విశ్వాసాలకు భంగం కలిగించేలా వ్యవహరించాడంటూ భారత క్రికెట్ వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై నమోదైన క్రిమినల్ కేసుల్లో విచారణ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓ బిజినెస్ మేగజైన్ ధోనీని విష్ణుమూర్తి అవతారంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనిపై కర్ణాటక హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు కాగా, ఆయనపై కేసు నమోదైంది. తొలుత కర్ణాటక హైకోర్టు విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిపై ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ ఉదయం కేసును విచారించిన ధర్మాసనం స్టే ఆర్డర్ ఇచ్చింది. కాగా, ధోనీని విష్ణుమూర్తిగా చూపిస్తూ, షూ సహా పలు వస్తువులను ఆయన చేతుల్లో పెట్టిన మేగజైన్ కవర్ పేజీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.

  • Loading...

More Telugu News