: ఎంజీబీఎస్ లో 5జీ వైఫై సేవలు ప్రారంభం
హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ లో 5 జీ వైఫై సేవలను ఆర్టీసీ జేఎండీ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రయాణికులకు మంచి సౌకర్యం కల్పించామన్నారు. ఈ వైఫై సేవలను 15 నిమిషాల పాటు ఉచితంగా ప్రయాణికులు వాడుకోవచ్చని ఆయన చెప్పారు. త్వరలో అన్ని జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లలో వైఫై సేవలు ప్రారంభించనున్నట్లు రమణారావు తెలిపారు. సాధారణ 3జీ, 4జీ లతో పోలిస్తే, 5జీ ఉపయోగించి మరింత వేగంగా సమాచారాన్ని బట్వాడా చేయవచ్చు.