: మానవ తప్పిదమే కారణం... డ్రైవర్ బ్రేకులు కూడా వేయలేదన్న ఆర్డీఓ


తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) సిరి ఆనంద్ తేల్చిచెప్పారు. వేగంగా వెళుతూ అదుపు తప్పిన సమయంలో లారీకి డ్రైవర్ బ్రేకులు కూడా వేయలేదని తమ విచారణలో వెల్లడైందని ఆయన చెప్పారు. ప్రమాద ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు సాగించిన అనంతరం కొద్దిసేపటి క్రితం ప్రాథమిక కారణాలను ఆయన వెల్లడించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి పెద్ద సంఖ్యలో కూలీల మరణానికి కారణమైన డ్రైవర్ పై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని కూడా సిరి ఆనంద్ చెప్పారు.

  • Loading...

More Telugu News