: ఆ బండిని బాగు చేయించి, రూ. 5 వేలు ఇవ్వండి: అనంత డీఎస్పీ
ఈ ఉదయం అత్యంత సాహసంతో ఇద్దరు గొలుసు దొంగలను పట్టించిన అనంతపురం యువకుడిని అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ పొగడ్తలతో ముంచెత్తారు. దుండగుల బైకును తన వాహనంతో ఢీకొట్టించి వారిని కిందపడేసి పోలీసులకు పట్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో యువకుడి ద్విచక్ర వాహనం టీవీఎస్ స్కూటీ ఏపీ02 ఏఎన్ 2668 దెబ్బతింది. అతని బైకును తక్షణం షోరూముకు తరలించి అన్ని రిపేర్లూ చేయించాలని, దెబ్బతిన్న భాగాలను రీప్లేస్ చేయాలని డీఎస్పీ ఆదేశించారు. ఆ యువకుడి సాహసానికి బహుమతిగా రూ. 5 వేల రివార్డును ప్రకటించారు. గొలుసు దొంగల పేర్లు, అలీ, వలిగా తెలిపిన పోలీసులు, స్థానికుల దాడిలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించామని, వారి ఫోటోలను అన్ని పీఎస్ లకూ పంపామని వివరించారు.