: ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న పోలీసాఫీసర్ ఏకే ఖాన్


గ్రామాలను దత్తత తీసుకున్న వారి జాబితాలో తాజాగా తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ చేరారు. సోమవారం ఉదయం సచివాలయానికి వెళ్లి మంత్రి కేటీఆర్ ను ఆయన కలిశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జూకల్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు మంత్రికి తెలిపారు. జూకల్ గ్రామాన్ని తీర్చిదిద్దుతానని డీజీ చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. డీజీ ఖాన్ ని అభినందించారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకుంటూ వారి సేవా దృక్పథాన్ని చాటుకున్నారు.

  • Loading...

More Telugu News