: ధోనీ కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే


మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై నమోదైన కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దాంతో ఆయనకు ఊరట లభించింది. బిజినెస్ టుడే పత్రిక కవర్ పేజీపై ధోనీ ఫోటోను విష్ణువు రూపంలో చిత్రీకరిస్తూ ప్రచురించిన నేపథ్యంలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దానిపై నమోదైన కేసుపై బెంగళూరు కోర్టులో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. దాంతో ధోనీ సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. బెంగళూరు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో తనపై పెండింగ్ లో ఉన్న క్రిమినల్ విచారణను రద్దు చేయాలని కోరారు. స్పందించిన కోర్టు పైవిధంగా తీర్పు వెలువరించింది.

  • Loading...

More Telugu News