: బీజేపీతో జట్టు కట్టిన మాంఝీ... సీట్ల షేరింగ్ లో కుదిరిన ఒప్పందం


బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి జనతాపరివార్ ను ఎదుర్కొనేదెలాగంటూ సంశయిస్తున్న బీజేపీకి ఎట్టకేలకు మిత్రపక్షం దొరికింది. బీహార్ మాజీ సీఎం జితన్ రాం మాంఝీ పార్టీ, బీజేపీల మధ్య పొత్తు కుదిరింది. నితీశ్ కుమార్ తో విభేదాలు పొడచూపిన నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేసేముందు మాంఝీ నేరుగా ఢిల్లీ వెళ్లి ప్రధానితో భేటీ అయ్యారు. ఆనాడే వారి మధ్య పొత్తు కుదిరిందన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే సీట్ల సర్దుబాటులో బీజేపీ, మాంఝీ పార్టీల మధ్య అవగాహన కుదరలేదు. ఈ నేపథ్యంలో ఒంటరిగానే బరిలోకి దిగక తప్పని పరిస్థితి బీజేపీకి ఎదురైంది. తాజాగా ఇరు పార్టీలు సర్దుబాటు ధోరణితో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు సీట్ల పంపకాలకు సంబంధించి ఇరు పార్టీల మధ్య ఓ అవగాహన కుదిరినట్లు సమాచారం. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లన్న విషయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.

  • Loading...

More Telugu News