: హైదరాబాద్ లో ఎన్ఆర్ఐ ఇంట్లో చోరీ
హైదరాబాద్ లోని మలక్ పేటలో ఓ ఎన్ఆర్ఐ నివాసంలో చోరీ జరిగింది. ఈ సంఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్ఆర్ఐ ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు కిలోన్నర బంగారం, 5 వేల యూఎస్ డాలర్లు దొంగిలించారు. దీంతో ఎన్ఆర్ఐ కుటుంబం లబోదిబోమంటున్నారు. దొంగలను పట్టుకోవాలంటూ పోలీసులను కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు.