: ఆ 'అక్రమ సంబంధాల' వెబ్ సైట్లో యూజర్ల పాస్ వర్డ్ లు ఇవే!
అక్రమ సంబంధాల వెబ్ సైట్ 'ఆహ్లే మాడిసన్'పై హ్యాకర్ల అటాక్ తరువాత, యూజర్లకు సంబంధించిన ప్రైవేటు చిత్రాలు వెలుగులోకి రాగా, పరువు పోయిందన్న మనస్తాపంతో పలువురు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా, యూజర్లు, వారి పాస్ వర్డ్ ల వివరాలు వెలుగులోకి వచ్చాయి. 'సైనోష్యూర్ ప్రైమ్' పేరిట ఉన్న హ్యాకర్లు, పాస్ వర్డ్ లను డీకోడ్ చేశారు. ఈ వెబ్ సైట్ యూజర్లలో అత్యధికులు వాడుతున్న పాస్ వర్డ్ '123456'. దీని తరువాత అత్యధికులు '12345', 'default', '123456789'లను వినియోగిస్తున్నారు. కామ్ పాస్ వర్డ్ లు వాడటం, అందరికీ తెలిసిన వరుస సంఖ్యలు ఉండటంతో, బ్యాడ్ గైస్ సులువుగా వీటిని హ్యాక్ చేస్తున్నారని టెక్ నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, పాస్ వర్డ్ లు బహిర్గతమైన విషయమై స్పందించేందుకు ఆహ్లే మాడిసన్ అధికారులు అందుబాటులో లేరు.