: ‘బూచేపల్లి’ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్, హెఓడీ అరెస్ట్... విద్యార్థిని సూసైడే నేపథ్యం!


ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన బూచేపల్లి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్ధిని అనూష ఆత్మహత్య కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. కళాశాలలో హెచ్ఓడీగా పనిచేస్తున్న మాలకొండారెడ్డి వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అనూష సూసైడ్ నోట్ రాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాలకొండారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కళాశాల చైర్మన్ బూచేపల్లి సుబ్బారెడ్డిని కూడా నేటి ఉదయం అరెస్ట్ చేశారు. నలుగురి ముందే అనుషను మాలకొండారెడ్డి వేధించేవాడని, ఈ కారణంగానే అనూష ఈ నెల 12న ఆత్మహత్య చేసుకుందన్న ఆరోపణల దిశగా దర్యాప్తు సాగించిన పోలీసులు నేటి ఉదయం వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News