: ఇరు పక్షాలకు న్యాయం చేసిన పవన్ కల్యాణ్
ఈ నెల 2వ తేదీన ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా భీమవరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో, భగ్గుమన్న పవన్ అభిమానులు అనుమానం ఉన్న కొందరిపై దాడులు చేశారు. చివరకు ఇది పవన్ కల్యాణ్, ప్రభాస్ ల అభిమానుల మధ్య గొడవగా మారిపోయింది. ఈ క్రమంలో, కొందరు పవన్ కల్యాణ్ అభిమానులపై కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో, రంగప్రవేశం చేసిన పవన్ కల్యాణ్ తన అభిమానుల వల్ల నష్టపోయిన వారికోసం రూ.3 లక్షలు పంపించారట. ఈ డబ్బును నష్టపోయిన వారికి ఇవ్వాలని కోరారట. ఈ వివరాలను భీమవరానికి చెందిన ఓ ఎస్సై స్వయంగా వెల్లడించారు. ఇదే సమయంలో, తన పలుకుబడి ఉపయోగించి, తన అభిమానులపై నమోదైన కేసులను కూడా పవన్ ఎత్తి వేయించారట. దీంతో, సంచలనం రేపిన ఘటనలో ఇరుపక్షాలకు న్యాయం జరిగినట్టైంది.