: ఏనుగు ఎదురొచ్చిన వేళ... ఏమైందో మీరూ చూడండి!
పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి జిల్లాలోని గొరుమారా అడవుల గుండా వెళ్లే 31వ నంబరు జాతీయ రహదారి అది. రోడ్డుపైకి ఓ పెద్ద ఏనుగు వచ్చింది. దీంతో ఇరు వైపులా వాహనాలు ఆగిపోయాయి. రోడ్డుకు ఒక పక్కగా ఏనుగు నిలబడి వుండటంతో బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తలు దాన్ని దాటి వెళ్లిపోవాలని తలచారు. బైకును ముందుకు దూకించారు. ఏనుగు చూసేసింది. వేగంగా అడుగులు వేస్తూ వారి సమీపానికి వచ్చింది. బైకును కిందపడేసి పక్కనే ఉన్న పొదల్లోకి ఒక వ్యక్తి దూకగా, తెల్ల ప్యాంటు, తెల్ల షర్టు వేసుకున్న మరో వ్యక్తి పారిపోయే క్రమంలో కిందపడ్డాడు. ఆ సమయంలో ఏనుగు దృష్టి బైకుపై ఉంది. దీంతో కిందపడ్డ ఆ వ్యక్తి బతుకు జీవుడా అనుకుంటూ లేచి పరుగులు పెట్టాడు. వీరిద్దరికీ స్వల్పగాయాలు కాగా, ఏనుగు బైకుపై దాడి చేసింది.. ఆపై కిందపడ్డ హెల్మెట్ తో బంతాట ఆడుకుంది. ఈ ఘటనంతా ఓ ప్రయాణికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. మీరూ చూస్తారా? ఆలస్యం చేయకుండా ఈ లింకుకు వెళ్లండి మరి.