: గండేపల్లి లారీ ప్రమాద ఘటనపై విచారణ జరిపిస్తాం: మంత్రి చినరాజప్ప
తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద ఈ తెల్లవారుజామున చోటుచేసుకున్న లారీ ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ప్రమాదానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి కొద్దిసేపటి కిందట పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదంలో 16 మంది చనిపోయారని, తొమ్మిది మంది గాయపడ్డారని చెప్పారు.