: విజయవాడ బాగాలేదు... మార్చాల్సిందే: చంద్రబాబు
మౌలిక వసతులు, సుందరీకరణ పరంగా విజయవాడ నగరం అసంతృప్తిని కలిగిస్తోందని, తక్షణమే సౌకర్యాలు మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. పరిపాలన మొత్తం విజయవాడ నుంచి సాగుతున్న తరుణంలో నగరం బాగాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడను అందంగా మార్చేందుకు నిధులిస్తామని, అధికారులు శ్రద్ధతో పనిచేయాలని సూచించారు. విజయవాడలో కాలువ గట్లపై ఉన్న అన్ని ఆక్రమణలను తొలగించి, ఆహ్లాదకరంగా ఉండేలా చూడాలని, మురుగు నీటి నిర్వహణకు ఆధునిక పద్ధతులను పాటించాలని అన్నారు. నగరంలోని 14 రోడ్ల బ్యూటిఫికేషన్ కోసం రూ. 96.32 కోట్లను ఖర్చుచేయాలని, ఇందుకోసం వెంటనే ప్రణాళికలను రూపొందించుకోవాలని అన్నారు.