: సానియా... నీ ప్రతిభ దేశం గర్వించేలా ఉంది: ప్రధాని మోదీ ట్వీట్
యూఎస్ ఓపెన్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్ సాధించిన హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మార్టినా హింగిస్ తో కలిసి బరిలోకి దిగిన సానియా రాత్రి జరిగిన ఫైనల్ లో విజయం సాధించి ఒకే కేలండర్ ఇయర్ లో రెండు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సాధించి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో సానియాను అభినందిస్తూ ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక సందేశం పంపారు. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా సానియాకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ సందేశం పోస్ట్ చేశారు. ‘‘సానియా, యూఎస్ ఓపెన్ లో నీ విజయం అద్భుతం. అభినందనలు. నీ విజయం పట్ల దేశం యావత్తు గర్విస్తోంది’’ అని మోదీ ట్వీట్ చేశారు.