: ‘గండేపల్లి’ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై తెల్లవారుజామునే సమాచారం అందుకున్న చంద్రబాబు ఘటన జరిగిన తీరుపై అధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.