: విజయవాడ చేపల మార్కెట్ లోని బస్తాల్లో ఓటర్ కార్డులు


విజయవాడలోని చేపల మార్కెట్ లోని బస్తాల్లో ఓటర్ గుర్తింపు కార్డులు పెద్ద ఎత్తున లభ్యమయ్యాయి. మొత్తం పది వేల ఓటర్ కార్డులుంటాయని వైఎస్సార్సీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ ఓటర్ కార్డులను పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలు సామినేని ఉదయభాను, గౌతంరెడ్డిలు దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గత ఎన్నికల్లో జరిగిన అవినీతికి ఈ ఓటరు కార్డులే సాక్ష్యమని వారు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ ఈ ఓటరు కార్డులన్నీ కొని ఓట్లు వేయించుకుని విజయం సాధించిందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News