: అది నా 55 ఏళ్ల కల...అలా ఎలా చెబుతాను?: ఆనం


అది తన యాభై ఐదేళ్ల కల అని, దాని గురించి అడగ్గానే చెప్పడానికి వీలుకాదని కాంగ్రెస్ నేత ఆనం వివేకానందరెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సరిగ్గా 35 ఏళ్ల క్రితం ఆ కలగన్నానని చెప్పిన ఆయన, తన కలను వెల్లడించారు. ఆ కల ఏంటంటే... తన ప్రేయసి ఒడిలో తల పెట్టుకుని, స్టైల్ గా సిగిరెట్ తాగుతూ మృత్యువును కౌగిలించుకోవాలనట! అయితే, మీ ప్రేయసి దొరికిందా? అంటే సుదీర్ఘంగా ఆలోచించిన ఆయన దీర్ఘంగా ఊపిరి పీల్చి, వదులుతూ ఇంకా దొరకలేదని, దొరుకుతుందేమో చూడాలని అన్నారు. చిరంజీవి 150వ సినిమాలో వేషం వేయాలని ఆయన అడగలేదని, ఎవరో సరదాగా అన్న విషయమని ఆయన చెప్పారు. చిరంజీవి అద్భుతమైన వ్యక్తి అని ఆయన తెలిపారు. పబ్లిక్ లో తాను వేసే వేషాలు, అక్కడి ప్రజల వేషభాషలని ఆయన చెప్పారు. వారిలో కలిసిపోయేందుకు అలా చేస్తానని ఆయన చెప్పారు. అంతే తప్ప సంచలనం కోసం అలా చేయనని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News