: మంత్రి నారాయణ దానకర్ణుడేమీ కాదు: ఆనం
ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ దానకర్ణుడేమీ కాదని కాంగ్రెస్ నేత ఆనం వివేకానందరెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి నారాయణను వ్యక్తిగతంగా తాను ఏనాడూ విమర్శించలేదని, అయితే ఆయన పని విధానాన్ని విమర్శించానని ఆయన చెప్పారు. తాను చెబితే కళాశాలల్లో ఉచితంగా సీట్లిచ్చేందుకు నారాయణ ఏమీ దానకర్ణుడు కాదని, దోచిపెట్టే మనిషి అంతకంటే కాదని ఆయన చమత్కరించారు. తమ మధ్య లోపాయికారీ ఒప్పందం ఏమీ లేదని ఆయన చెప్పారు. వెంకయ్యనాయుడును ప్రత్యేక హోదా విషయంలో ఏమీ అనకపోవడానికి కారణం? అంటూ సంధించిన ప్రశ్నను ఆయన నెమ్మదిగా దాటవేశారు. తమ కుటుంబంలో ఎలాంటి కలతలు లేవని, తన తమ్ముళ్లిద్దరూ తనతోనే ఉన్నారని, తామంతా ఒకే పార్టీలో ఉన్నామని ఆయన చెప్పారు.