: ‘శ్రీమంతుడు విజయోత్సవ వేడుకలు న్యూయార్క్ లో నిర్వహిస్తాం’


ఇటీవల విడుదల కలెక్షన్లతో దూసుకుపోతున్న శ్రీమంతుడు చిత్రం విజయోత్సవ వేడుకలను అక్టోబర్ 24న అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించనున్నట్లు ఆ సినిమా నిర్మాత యలమంచిలి రవిశంకర్ చెప్పారు. విజయవాడలోని తన మిత్రుల ఇంటికి వచ్చిన ఆయన మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు న్యూజెర్సీలో ఎక్కువగా ఉన్నందువల్ల ఈ వేడుకలను అక్కడ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ వేడుకల్లో శ్రీమంతుడు హీరో, హీరోయిన్లతో పాటు నటీనటులందరూ పాల్గొంటారని నిర్మాత రవిశంకర్ చెప్పారు.

  • Loading...

More Telugu News