: తమిళనాడు గవర్నర్ రోశయ్యకు ఎన్జీ రంగా అవార్డు ప్రదానం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్యకు ఎన్జీ రంగా అవార్డును ప్రదానం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో నన్నపనేని రాజకుమారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును రోశయ్య అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ అవార్డును తనకు ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి, ఏపీ డిప్యూటీ స్పీకర్ బుద్ధ ప్రసాద్, ఎమ్మెల్యే ఆలపాటి రాజా, పలువురు ప్రజా ప్రతినిధులు, పురప్రముఖులు హాజరయ్యారు.