: విజయ దరహాసంతో బాక్సింగ్ వీరుడు మేవెదర్ రిటైర్మెంట్
రెండు దశాబ్దాల పాటు ఓటమి ఎరుగని బాక్సింగ్ వీరుడు ప్లాయిడ్ మేవెదర్ ప్రపంచ వెల్టర్ వెయిట్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆండ్రీ బెర్టోతో జరిగిన ఈ పోరులో మేవెదర్ పూర్తిస్థాయిలో విరుచుకుపడ్డాడు. మేవెదర్ కెరీర్ లో 49-0 విజయం ఇది. దీంతో హెవీ వెయిట్ లెజెండ్ రాకీ మార్కియానో రికార్డుతో సమంగా ఉన్నాడు. ఆండ్రీ బెర్టోతో జరిగే పోరు అనంతరం తాను రిటైర్మెంట్ తీసుకుంటానని చెప్పిన మేవెదర్ అదే పని చేశాడు. చివరి విజయంతో రిటైర్మెంట్ ప్రకటించాడు మేవెదర్. కాగా, ఎంటర్టెయిన్ మెంట్ రంగంలో కూడా అడుగుపెట్టాలని చూస్తున్న మేవెదర్ కు మూడు సినిమా ఆఫర్లు ఇప్పటికే వచ్చాయి.