: ఐదు రోజులు ఉల్లిపాయలు తినకపోతే చస్తారా?: రాజస్థాన్ మంత్రి
ఐదు రోజులు ఉల్లిపాయలు తినకపోతే చచ్చిపోతారా? అంటూ రాజస్థాన్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రభులాల్ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జైపూర్ సమీపంలోని ఓ గ్రామానికి వెళ్లిన మంత్రి అక్కడి స్థానికులతో మాట్లాడుతుండగా, ఉల్లి ధరలు ఎందుకు అదుపులోకి రావడం లేదని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహంచిన మంత్రి ఓ ఐదు రోజులు ఉల్లిపాయలు లేకపోతే చచ్చిపోతారా? అని అడిగారు. దీంతో రైతులు అవాక్కయ్యారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ధరలు తగ్గించడం చేతకాని ప్రభుత్వం, తినకపోతే ఏమవుతుందని ప్రశ్నిస్తోందని, ఇది పాలకుల అసమర్థతకు నిదర్శనమని వారు పేర్కొంటున్నారు.