: సల్మాన్ ను అభినందించిన మహేష్ బాబు


బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభినందించారు. గతంలో వచ్చిన హిట్ చిత్రం 'హీరో'ను ఇటీవల సల్మాన్ ఖాన్ తన సొంత నిర్మాణ సంస్థపై రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈమధ్యే విడుదలైన ఈ సినిమాను మహేష్ బాబు చూశారు. అనంతరం ట్విట్టర్ ద్వారా సల్మాన్ ను అభినందించారు. అథియా శెట్టి, సూరజ్ పంచోలీ లను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన సల్మాన్ ఖాన్ కు ధన్యవాదాలని మహేష్ బాబు ట్వీట్ చేశారు. సినిమా యూనిట్ మొత్తానికి అభినందనలని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News