: మెక్సికోలో 6.6 తీవ్రతతో భూకంపం


నేటి తెల్లవారు జామున మెక్సికోను భూకంపం పట్టికుదిపేసింది. లాస్ మోఛీస్ దగ్గర్లో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు తెలిపారు. 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు వెల్లడించారు. టూరిస్టు క్షేత్రానికి దగ్గర్లో సముద్రంలోని పది కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్టు యూఎస్ జియొలాజికల్ అధికారులు తెలిపారు. అయితే, భూకంపం కారణంగా జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం లేదని అన్నారు. అయితే ఒక్కసారిగా ఆయా ప్రాంతాలన్నీ ఊగిపోయాయని వారు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News