: రణబీర్ మంచి నటుడు: దీపికా పదుకొణే కితాబు


అతనొక మంచి నటుడు అంటూ రణబీర్ కపూర్ గురించి దీపికా పదుకొణే కితాబిచ్చింది. వీళ్లిద్దరూ కలిసి జంటగా నటించిన తాజా చిత్రం 'తమాషా'. దీని ప్రచారంలో భాగంగా దీపికా పదుకొణే మాట్లాడుతూ 'ప్రతి ఒక్కరి జీవితంలో జయాపజయాలు సాధారణం. తమాషా చిత్రం కంటే ముందు నటించిన చిత్రాల గురించి నేనేమీ మాట్లాడను' అని చెప్పింది. ఈ నెల 22వ తేదీన ఈ చిత్రం ట్రైలర్ విడుదల కానుంది. నవంబర్ 27న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి దర్శకుడు ఇంతియాజ్ అలీ.

  • Loading...

More Telugu News