: బీహార్ మాజీ సీఎం జితిన్ రాం మాంఝీ కుమారుడు అరెస్ట్
బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితిన్ రాం మాంఝీ కుమారుడు ప్రవీణ్ మాంఝీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్ లో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ప్రవీణ్ మాంఝీ 4.65 లక్షల రూపాయలు పట్టుకుని వెళ్తుండగా, జహానాబాద్ లో ఆయనను అరెస్టు చేశారు. ఈ మొత్తానికి సంబంధించిన వివరాలు, రశీదులు లేకపోవడంతో అతనిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే, ఒక నిర్మాణానికి సంబంధించి గుత్తేదారు (కాంట్రాక్టర్)కు చెల్లించడం కోసం ఈ డబ్బును తీసుకువెళుతున్నట్టు జితిన్ రాం మాంఝీ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి తెలిపారు.