: మోదీ మా ఆఫీసుకు వస్తున్నారు: ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ నెల 27న తమ ఆఫీస్ కు వస్తున్నారంటూ ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా సామాజిక, ఆర్థిక సవాళ్లకు పరిష్కారాలపై మోదీతో చర్చించేందుకు ప్రశ్నలు పంపించాలని ఆయన కోరారు. అలాగే వీడియోలు కూడా పంపించాలని ఆయన సూచించారు. ఈ వీడియోలు మోదీ పేజ్ లో కూడా కనిపిస్తాయని ఆయన తెలిపారు. గతేడాది భారత పర్యటనలో మోదీని కలిసే అవకాశం చిక్కిందని తెలిపిన జుకెర్ బర్గ్, ఈసారి అమెరికాలో ఆతిథ్యమిచ్చే అవకాశం దొరికిందని అభిప్రాయపడ్డారు.