: బాబుగారూ... ఏ అంశంలోనూ మీకు స్పష్టత లేదు: ఏపీ సీఎంకు ఉండవల్లి ఘాటు లేఖ
రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి ఘాటు లేఖ రాశారు. ఏ ఒక్క అంశంలోనూ ప్రభుత్వానికి స్పష్టత లేదని ఆరోపిస్తూ ఆయన రాసిన లేఖ కలకలం రేపుతోంది. ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై చర్చకు సిద్ధమని ప్రకటించిన తన సవాల్ ను కేబినెట్ లోని ఓ మంత్రి పిచ్చికూతలంటూ వ్యాఖ్యానించారని ఉండవల్లి ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తాను సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఒకవేళ మంత్రులకు వీలు లేకుంటే, కనీసం అధికారితోనైనా వివరణ ఇప్పించాలని ఉండవల్లి డిమాండ్ చేశారు.