: ఢిల్లీ రోడ్లపై పరుగులు తీయనున్న ఆరెంజ్ బస్సులు
దేశ రాజధాని ఢిల్లీలో బస్సుల కొరతకు త్వరలో చెక్ పడనుంది. దీంతో ప్రయాణికులకు కొంత ఊరట లభించనుంది. కొత్తగా 1000 ఆరెంజ్ బస్సులు ఢిల్లీ నగర వీధుల్లో పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టం (డీఐఎంటీఎస్)కు ఆదేశాలు అందాయి. మరో ఆరునెలల్లో ఢిల్లీలోని అన్ని బస్సు డిపోల్లో కొత్త బస్సులు ప్రారంభం కావాలని ఈ ఆదేశాల్లో ఉన్నట్లు సమాచారం. కొత్తగా ప్రవేశపెట్టనున్న 1000 బస్సుల్లో 300 ఏసీ బస్సులు ఉన్నాయి. లెక్కప్రకారం, కోర్టు ఆదేశాలను అనుసరించి దేశ రాజధాని ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకుగాను 5,500 బస్సులు ఉండాలి. కానీ, బస్సుల కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కొత్త బస్సులు అందుబాటులోకి రానుండటంతో ఢిల్లీ ప్రజలకు కొంత మేరకు ఊరట లభించనుంది.