: మితిమీరుతున్న పయ్యావుల దౌర్జన్యాలు: వైఎస్ఆర్సీపీ
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ పై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. అనంతపురంలో విలేకరులతో వారు మాట్లాడారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో పయ్యావుల దౌర్జన్యాలు రానురాను పెరిగిపోతున్నాయంటూ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, శంకర్ నారాయణ, గుర్నాథ్ రెడ్డి ఆరోపించారు. 2009లో సూరయ్య హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పయ్యావుల దాని నుంచి బయటపడేందుకు యత్నిస్తున్నారని అన్నారు. పయ్యావుల దాష్టీకాలను నిరసిస్తూ ఈ నెల 16న బెలుగుప్పలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆ నేతలు పేర్కొన్నారు.