: యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ
నల్గొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. క్యూలలో భక్తులు బారులు తీరి ఉన్నారు. భక్తుల రద్దీ ఎక్కువవడంతో కొండపైకి వెళ్లే వాహనాలను అధికారులు నిలిపివేశారు. దీంతో తమ వాహనాలను ఎప్పుడు కొండపైకి వదులుతారా అని వాహనదారులు ఎదురు చూస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో సాధారణంగా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.