: సైకో ‘సూదిగాడు’ దొరికాడు... పోలీసులకు పట్టించిన ఫిలింనగర్ వాసులు
ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల ప్రజలను వణికించి తెలంగాణలోకి ప్రవేశించిన సైకో ‘సూదిగాడు’ ఎట్టకేలకు హైదరాబాదు నగర పోలీసులకు చిక్కాడు. కొద్దిసేపటి క్రితం నగరంలోని ఫిలింనగర్ లోకి ప్రవేశించిన సైకో ఓ చిన్నారికి సూది గుచ్చేందుకు యత్నించాడు. అయితే సూదిగాడి దాడిని పసిగట్టిన స్థానికులు వెనువెంటనే అప్రమత్తమయ్యారు. సిరంజి దాడి నుంచి పాపను రక్షించిన స్థానికులు సూదిగాడిని మాత్రం బంధించేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఫిలింనగర్ చేరుకుని అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.