: మాజీ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య... అనారోగ్యమే కారణమంటున్న కుటుంబసభ్యులు
తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే సాగు కలిసిరాక అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నారు. రైతు ఆత్మహత్యలు లేని రోజు తెలుగు రాష్ట్రాల్లో లేదంటే అతిశయోక్తి కాదేమో. తాజాగా కొద్దిసేపటి క్రితం తెలుగు ప్రజలకు మరో షాకింగ్ న్యూస్ వినిపించింది. చిత్తూరు జిల్లాలోని తిరుపతి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పనిచేసిన మోహన్ సతీమణి సుకేశన (54) ఆత్మహత్య చేసుకున్నారు. తిరుపతిలోని తన సొంతింటిలోనే ఆమె ఉరేసుకుని తనువు చాలించారు. అనారోగ్య కారణాలతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నారని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని నగరంలోని రుయా ఆసుపత్రికి తరలించారు.