: నిజామాబాద్ లో పెరిగిపోతున్న కల్తీ కల్లు బాధితులు
నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. 40 మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 70 మంది కల్తీ కల్లు బాధితులు చేరారు. బాధితులను అదుపు చేయలేక వైద్య సిబ్బంది నానా ఇబ్బంది పడుతున్నారు. నిజామాబాద్, బాన్స్ వాడ, కోటగిరి తదితర ప్రాంతాలకు చెందిన కల్తీ కల్లు బాధితులకు చికిత్స కొనసాగుతోందని అధికారులు తెలిపారు. బాధితులందరూ వింత చేష్టలతో ప్రవర్తిస్తున్నారని చెప్పారు. కల్తీ కల్లు బాధితులు వారి కుటుంబ సభ్యులపై దాడికి దిగుతుండటంతో ఆసుపత్రిలోని మంచాలకు వారి చేతులు, కాళ్లు కట్టి వేస్తున్నట్లు సమాచారం. కాగా, కల్తీ కల్లు బాధితులను పర్యవేక్షించేందుకు ప్రభుత్వాసుపత్రి మొత్తంలో ఒకే ఒక్క డాక్టరు ఉన్నారు.