: చిన్నారిని పొట్టనబెట్టుకున్న పోలియో చుక్క.... నాగోల్ అంగన్ వాడీలో ఘటన
హైదరాబాదులోని నాగోల్ పరిధిలో నేటి ఉదయం దారుణం చోటుచేసుకుంది. అంగవైకల్యానికి కారణంగా నిలుస్తున్న పోలియో మహమ్మారిని తరిమివేసేందుకు వాడుతున్న పోలియో చుక్కలు ఏడాదిన్నర వయస్సున్న చిన్నారిని పొట్టనబెట్టుకున్నాయి. నాగోల్ లోని అంగన్ వాడీ కేంద్రంలో నిన్న చిన్నారికి పోలియో చుక్కలు వేశారు. రాత్రికే అనారోగ్యం బారినపడ్డ చిన్నారి నేటి ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయింది. పోలియో చుక్కల కారణంగానే తమ చిన్నారి చనిపోయిందని రోధిస్తున్న తల్లిదండ్రుల వేదన అక్కడి వారిని కలచివేసింది. దీనిపై సమాచారం అందుకున్న వైద్యాధికారులు అసలు ఏం జరిగిందనే దానిపై విచారణ ప్రారంభించారు.