: కాశ్మీర్ లో మారోమారు పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు... యువతపై పోలీసుల లాఠీచార్జీ


జమ్మూ కాశ్మీర్ యువత మరోమారు రెచ్చిపోయింది. ఆ రాష్ట్ర రాజధాని శ్రీనగర్ లో మరోమారు ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలతో మారుమోగింది. బిగ్ కాశ్మీర్ పేరిట నిర్వహించిన మారథాన్ లో పాలుపంచుకున్న పలువురు యువకులు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినదించారు. అంతేకాక భారత్ కు వ్యతిరేకంగానూ పలు నినాదాలు చేశారు. దీంతో అక్కడ కలకలం చోటుచేసుకుంది. పాక్ అనుకూల నినాదాలు చేసిన యువకులను నిలువరించేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. దీంతో యువకులు పరుగులు పెట్టారు. ఈ పరిణామంతో మారథాన్ రన్ కాస్తా గందరగోళంగా మారింది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News