: చైనాలో కేసీఆర్ బిజీబిజీ... నేడు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా సందర్శన
కొత్త రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టేందుకు చైనా వెళ్లిన తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న చైనా రాజధాని బీజింగ్ లో ఆయన బిజీబిజీగా గడిపారు. చైనాకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహించిన ముఖ్యమంత్రి, వారిలో తెలంగాణలో పెట్టుబడులపై ఆసక్తి కల్పించారు. తాజాగా నేడు కేసీఆర్ తన ప్రతినిధి బృందంతో కలిసి చైనా నగరం షెంజాన్ లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సందర్శిస్తారు.