: మహిళ బ్యాగులో రూ.లక్ష... బైక్ పై వచ్చి కొట్టేసిన దొంగలు


సికింద్రాబాదు పరిధిలోని గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కొద్దిసేపటి క్రితం చైన్ స్నాచింగ్ తరహాలో ‘బ్యాగ్ స్నాచింగ్’ జరిగింది. బైక్ పై వేగంగా దూసుకువచ్చిన ఇద్దరు దొంగలు ఓ మహిళ భుజానికున్న బ్యాగును కొట్టేసి అంతే వేగంతో మాయమయ్యారు. షాక్ తిన్న బాధిత మహిళ గోపాలపురం పోలీస్ స్టేషన్ కు పరుగు పరుగున వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దొంగలు కొట్టేసిన బ్యాగులో రూ.లక్ష నగదు ఉందని ఆ మహిళ చేసిన ఫిర్యాదుతో క్షణాల్లో రంగంలోకి దిగిన పోలీసులు బ్యాగ్ స్నాచర్ల కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News