: కేసీఆర్ ను విమర్శిస్తున్నారు...చంద్రబాబు చేసిందేంటి?: హరీష్ ప్రశ్న
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించడంపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ చైనా పర్యటనపై మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు లేదని స్పష్టం చేశారు. 'అందరికీ కేసీఆర్ పర్యటనే కనపడుతోందా? టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన పర్యటనలు కనపడడం లేదా?' అని నిలదీశారు. చంద్రబాబుతో పోల్చుకుంటే కేసీఆర్ చాలా కష్టపడుతున్నారని ఆయన చెప్పారు. తెలంగాణకు కేసీఆర్ అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణకు పెట్టుబడులు తెచ్చి మరింత ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారని ఆయన స్పష్టం చేశారు.